Breaking News

సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక భేటీ

Published on Thu, 02/09/2023 - 20:11

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పిలుపునిచ్చారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు సంబంధించి గురువారం శాసనసభ కమిటీ హాల్‌లో కేటీఆర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు గ్రేటర్‌ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈనెల 12 వరకు అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో 13న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్‌ ఆదేశించారు.

జన సమీకరణకు సంబంధించి 13న జరిగే సమావేశాల్లో ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన జన సమీకరణను పర్యవేక్షించేందుకు ఇతర జిల్లాలకు చెందిన సీనియ ర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించాలని నిర్ణయించారు.

ఇన్‌చార్జిలుగా నియమితులయ్యే నేతలు ఈ నెల 13 నుంచి 17 వరకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారు. బహిరంగసభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందితో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టిన నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)