Breaking News

మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ సమీక్షలు

Published on Sat, 05/31/2025 - 05:05

సాక్షి హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

జనగామ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి ఓటమిపై మీనాక్షి ఆరా తీసినట్టు తెలిసింది. ‘మీరు ఎందుకు ఓడిపోయారు?’అని ప్రతాపరెడ్డిని మీనాక్షి ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ నేతలే ఇందుకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్ష అనంతరం ఆదివాసీ విభాగం సమావేశంలో వారు పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురామ్‌ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపాయి.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)