Breaking News

మీ టికెట్‌కు ఏడాది పూర్తి.. త్వరలో టీజీఆర్‌టీసీ సేవలు?

Published on Fri, 01/09/2026 - 17:56

సాక్షి, హైదరాబాద్‌: బహుళ ప్రజా సేవలకు ఒకే వేదికగా డిజిటల్ టికెటింగ్ అందిస్తున్న మీ టికెట్ యాప్‌ విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో యాప్‌ను సుమారు 2 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, రూ.2.5 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. 3.5 లక్షలకుపైగా టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.

సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రారంభమైన ఈ యాప్‌ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో, పార్కులు, దేవాలయాలు, మ్యూజియంలు, కోటలు, బోటింగ్ కేంద్రాలు, నేచర్ క్యాంపులు, కమ్యూనిటీ సౌకర్యాలకు డిజిటల్ టికెటింగ్‌ను ఒకే యాప్‌లో అందిస్తోంది.

త్వరలో మీటికెట్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగర, ఉపనగర ప్రయాణికుల కోసం క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు, అంతర్‌నగర బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ దశలో సాధారణ పాస్, మెట్రో డీలక్స్ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ) పాస్, పుష్పక్ ఏసీ పాస్‌లను యాప్‌లో పొందుపరచనున్నారు.

జనవరి 2026 నాటికి మీ టికెట్ పరిధిలో సుమారు 123 పార్కులు, 50 బోటింగ్ కేంద్రాలు, 16 దేవాలయాలు, 6 మ్యూజియంలు, 4 కోటలు/స్మారకాలు, 4 జలపాతాలు, 11 జీహెచ్ఎంసీ పార్కులు, 5 నేచర్ క్యాంపులు, ఒక హైదరాబాద్ మెట్రో ఇంటిగ్రేషన్, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక ప్రాంతాలకు ఒకే యాప్ ద్వారా చేరువ చేసే ‘సూపర్ యాప్’గా మీటికెట్ నిలుస్తోందని వారు పేర్కొన్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)