Breaking News

భర్త, పిల్లల్ని వదిలేసి వస్తా.. నన్ను పెళ్లి చేసుకో..!

Published on Mon, 10/13/2025 - 08:42

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమిస్తున్నానని చెప్పి రూ.10లక్షలు, ప్లాట్‌, బంగారం తీసుకుంది.. పెళ్లి చేసుకోవాలని వేధించింది.. అంగీకరించకపోవడంతో చివరకు చంపించిందని ఈనెల 10న సెంటినరీకాలనీలో హత్యకు గురైన కోట చిరంజీవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. 

స్థానిక ప్రెస్‌ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతుడు చిరంజీవి సోదరులు రామ్‌చరణ్‌, సాయిచరణ్‌తోపాటు బావమరిది నరేశ్‌ మాట్లాడారు. చిరంజీవికి ఇంటర్‌లో క్లాస్‌మేట్‌ సంధ్యారాణి అని, మీసేవ కేంద్రానికి వచ్చి ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకునేదన్నారు. ప్రేమిస్తున్నాని చెప్పి దాదాపు రూ.10లక్షల నగదు, 5 తులాల బంగారం, ఒక ప్లాట్‌ తీసుకుందని తెలిపారు. వివాహం చేసుకోవాలని వేధించిందని, ఇద్దరు పిల్లలతోపాటు ఇద్దరు పెళ్లి కాని సోదరులున్నారని, వివాహం చేసుకోనని తిరస్కరించాడని వివరించారు. 

డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతోనే పగ పెంచుకొని పథకం ప్రకారంగా హత్య చేయించినట్లు అనుమానముందని ఆరోపించారు. వీరి ప్రేమ వ్యవహారంలో వీర్లపల్లిలో గతంలోనూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు గుర్తు చేశారు. చిరంజీవి మొబైల్‌ ఫోన్‌ ఓపెన్‌ చేస్తే వీడియోలు, మెసేజ్‌లు, డబ్బుల సమాచారముంటుందని, సీసీ కెమెరాలు పరిశీలించాలన్నారు. దీనివెనక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానముందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నాగరాజు, శ్రీజ, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)