Breaking News

ఎంత పనిచేశావ్‌ మౌనిక..!

Published on Sat, 01/03/2026 - 11:53

మెదక్ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్‌ ఇంజిన్‌ డ్రెవర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 23న గ్రామ శివారులోని నేరళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

 దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య మౌనికపై అనుమానంతో విచారించగా ఇదే గ్రామానికి చెందిన సంపత్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారిందని చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తను హతమార్చాలని పథకం రంచించి... గత నెల 22న రాత్రి స్వామి మద్యం తాగి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా మౌనిక ఆమె ప్రియుడు సంపత్‌ అతడి గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహన్ని బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరళ్లకుంటలో పడేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)