చితిలోనుంచి శవాన్ని బయటకులాగి..

Published on Sun, 11/02/2025 - 10:12

మెదక్‌ జిల్లా (తూప్రాన్‌): సగం కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చితి నుంచి బయటపడేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంటలో శనివారం వెలుగు చూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం మృతి చెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు శనివారం కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చల్లార్చి చితి పక్కకు పడేసి కనిపించింది. 

ఈ విషయం తెలుసుకున్న మురాడి నర్సమ్మ కుటుంబీకులు సైతం శ్మశానానికి చేరుకొని చూడగా నర్సమ్మ చితికి సంబంధించిన బూడిదను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మృతి చెందిన పోచమ్మ, మల్లయ్యకు సంబంధించిన పుర్రెతో పాటు ఎముకలను కూడా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఎముకలు, పుర్రెలను మృతదేహం నోటిలో ఉంచే బంగారం కోసమా? అసలు ఎందుకు ఎత్తుకెళుతున్నారో తెలియడం లేదు. విచారణ జరుపుతామని ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Videos

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)