Breaking News

అమ్మా.. ఐశ్వర్య ఎక్కడున్నావ్!

Published on Tue, 12/16/2025 - 07:31

రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. 

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండు, కళ్యాణిలు  హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌ కాలనీలో ఉంటున్నారు. పాండు హయత్‌నగర్‌లో ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.వారికి కుమారుడు వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండగా కూతురు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌  ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల హస్టల్‌లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది. 

 సోమవారం  ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందుకు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో ఎల్‌బినగర్‌ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెటా కారు (టీఎస్‌ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన  ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీవ్ర గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరి్పంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)