Breaking News

హైదరాబాద్‌లో మరో స్టీల్‌ బ్రిడ్జి

Published on Sat, 01/03/2026 - 06:54

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌బ్రిడ్జి కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్‌టీ నుంచి అశోక్‌నగర్‌ వరకు నిర్మించిన  బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్‌– శామీర్‌పేట్‌ మధ్య 18.18 కి.మీ మేర  బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్‌ దక్కించుకుంది. 

రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. వెస్ట్‌ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ (Shamirpet ORR Junction) వరకు నిర్మించే ఈ స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి నేరుగా ఔటర్‌ మీదుగా రాజీవ్‌ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్‌ రూట్‌లో ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్‌ కారిడార్‌తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి. 

స్టీల్‌ బ్రిడ్జి ఎలివేటెడ్‌ కారిడార్‌ ఇలా..  
ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు 18.18 కి.మీ. నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ వద్ద 6 లేన్‌లతో టన్మెల్‌ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్‌ (Alwal) వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్ర‌మించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్‌లు ఉంటాయి. 

 ఈ ప్రాజెక్టు కోసం  9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్‌ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది.    

వేగిరంగా డెయిరీఫామ్‌ కారిడార్‌.. 
ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి మేడ్చల్‌ రూట్‌లో డెయిరీఫామ్‌ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ (elevated corridor) నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్‌ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ మీదుగా మెదక్, నిజామాబాద్‌ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)