Breaking News

దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..

Published on Mon, 05/05/2025 - 13:50

కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్‌ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్‌ (25), ఎల్‌బీనగర్‌కు చెందిన చెన్నకేశవ గౌడ్‌ (23), వివేక్, సురేష​​, యశ్వంత్‌ నాయక్‌ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్‌ కారు నడుపుతుండగా, చార్లెస్‌ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కీసర ఎగ్జిట్‌ దాటిన తర్వాత ముందున్న గ్యాస్‌ కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్‌తో పాటు చార్లెస్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

 చెన్నకేశవ గౌడ్‌ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)