Breaking News

HYD: అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి, పలువురికి గాయాలు

Published on Wed, 07/24/2024 - 07:31

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. పాతబస్తీలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్‌ పరిధిలోని వెంకటేశనగర్‌లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పైఅంతస్తులోకి వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలు ఫస్ట్‌ ఫ్లోర్‌కు వ్యాపించండంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు.

అనంతరం, స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటలను నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో  80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్‌ పెద్ద కూతురు శివప్రియ(10) మృతిచెందింది. ఇక, ఘటనలో మరో ఎనిమిదికి గాయాలు కావడంతో వారికి చికిత్స జరుగుతోంది. 

కాగా, భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్ని మంటలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.

భవనం కింద భాగంలో ఫోమ్‌ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)