Breaking News

చనిపోయిన వారి పింఛన్ల రికవరీ

Published on Tue, 08/05/2025 - 12:58

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబసభ్యులు అధికారులకు తెలియ జేయకపోవ డంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. వృద్ధులు, ఇత రకేటగిరీల వారికిచ్చే రూ.2,016 మొదలు.. దివ్యాంగులకు ఇచ్చే రూ.4,016 వరకు చనిపో యిన లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్‌ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పింఛన్‌దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 

ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ– పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్‌ వెరిఫికేషన్, ఎన్‌ఐసీ పోర్టల్‌లో పేర్లను సరిచూడడం వంటి వాటి ద్వారా పింఛన్‌దారులు చనిపోయినా వారి కుటుంబసభ్యు లు డబ్బులు విత్‌డ్రాచేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్‌ డెబి ట్‌ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలింది. దీంతో మరణించిన 28 వేల పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొల గించినట్టు అధికారులు వెల్లడించారు. అదేసమ యంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పింఛన్‌ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)