Breaking News

యూట్యూబర్‌ అన్వేష్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Published on Sat, 01/03/2026 - 18:49

సాక్షి,హైదరాబాద్‌: నమస్తే ఫ్రెండ్స్​. నాపేరు అన్వేష్​. నేను ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్​ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ అంటూ ప్రపంచ దేశాల్లో వింతలు, విశేషాల గురించి వివరించే యూట్యూబర్‌ అన్వేష్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస వివాదాలు, క్షమాపణలు, సబ్‌స్కైబర్ల సంఖ్య భారీ పడిపోయింది.

ఈ క్రమంలో గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్‌పై తెలంగాణ మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్‌ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. 

మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందించడమే కాకుండా, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఆ ఛానల్‌లో ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులపై.. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. 

సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను సేకరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ అంశాలు ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. విచారణలో సంబంధిత ఇన్‌ఫ్లుయెన్సర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది.

మహిళల గౌరవాన్ని కాపాడటంలో, బాలల హక్కులను రక్షించడంలో ఇలాంటి చర్యలు అత్యవసరమని కమిషన్ పేర్కొంది. ఎన్‌సీడబ్ల్యూ ఈ కేసుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)