Breaking News

అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..

Published on Tue, 06/17/2025 - 11:35

మహబూబాబాద్‌ రూరల్‌ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 

జిల్లాలోని బయ్యారం మండలం జగత్‌ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్‌ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్‌ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్‌.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

 

Videos

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)