Breaking News

‘నా భార్యను చంపేశాను’

Published on Sat, 12/21/2024 - 07:47

మణికొండ: ‘నా భార్యను చంపేశాను.. పీడ విరగడైంది’.. అంటూ ఓ సైకో భర్త వీధిలో వీరంగం సృష్టించి పైశాచిక ఆనందం పొందాడు. శుక్రవారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం శాయినిపేటకు చెందిన సునీత, ఇదే గ్రామం పక్కన ఉన్న దౌరుడిపల్లికి చెందిన ముత్యాలు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు. కోకాపేటలో హోటల్‌ నడుపుతూ జీవిస్తున్నారు. ముత్యాలు తరచూ భార్యను కొడుతుండేవాడు. డబ్బులు కావాలని వేధించేవాడు. 

ఈ క్రమంలో పలుమార్లు ఇరు కుంటుంబాల మధ్య పంచాయితీలు నడిచాయి. ‘ఎప్పటికైనా నిన్ను చంపుతా’ అని భార్య సునీతను ముత్యాలు బెదిరించేవాడు. గతంలో సునీత ఆరు నెలల పాటు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందింది. రెండు రోజుల క్రితం మృతురాలి బంధువు ఆంజనేయ స్వామి మాల వేయటంతో పూజకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు శుక్రవారం ఇంట్లో గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ముత్యాలు భార్య గొంతు నులిమి, మర్మాయవాల్లో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు. 

కాగా.. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీతను రెండో వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి.. ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. ‘నా భార్యను చంపాను’ అంటూ అరుస్తూ నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేశారు.  

రహదారిపై రక్తచరిత్ర


 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)