Breaking News

ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు!

Published on Wed, 12/17/2025 - 03:36

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన డీవీ­సీఎం(డివిజన్‌ కమిటీ) ఇన్‌చార్జ్‌తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రి­తం సిర్పూర్‌ యూ మండలం బాబ్జిపేట, కకర్‌బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్‌తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 

వీరిని ఏకే 47, ఇన్సాస్‌ రైఫిల్‌ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొ­దటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలి­యా­స్‌ దామోదర్‌ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టు­బడిన వారిలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరి­లో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది. 

నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, సిర్పూర్‌ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పో­లీ­సులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్‌ నిర్వహిస్తు­న్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆప­రేషన్‌ కగార్‌ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర నిర్బంధ పరి­స్థితులు ఏర్పడడంతో సేఫ్‌ జోన్‌గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌ నారా­యణ­రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ నితికాపంత్‌ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికా­రులే వెల్లడించే అవకాశముందన్నారు. 

#

Tags : 1

Videos

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

బాబూ... అప్పుడే ఎందుకు భయపడుతున్నావ్..? అతి దగ్గరలోనే!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)