Breaking News

‘మంచు’ కుటుంబంలో హైడ్రామా

Published on Mon, 12/09/2024 - 04:27

సాక్షి, హైదరాబాద్‌:     ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో ఆదివారం హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, ఉదయం డయల్‌–100కు కాల్‌ చేసిన మనోజ్‌ తనపై దాడి జరిగిందని చెప్పడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మనోజ్‌ నడలేని పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది.

మనోజ్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, మెడికో లీగల్‌ కేసుగా పరిగణిస్తూ బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం ఈ అంశంపై తమకు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, డయల్‌–100కు కాల్‌ చేసిన మనోజ్‌ తనపై దాడి జరిగిందని మాత్రం చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

హోరెత్తిన సోషల్‌ మీడియా 5
పహడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లిలో ఉన్న ఇంట్లో తనతో పాటు తన భార్యపై దాడి జరిగిందంటూ మనోజ్‌ పంపినట్లుగా ఉన్న ఓ సందేశం ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు డయల్‌–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జల్‌పల్లిలోని ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మోహన్‌బాబు, మనోజ్‌ తదితరులు ఇది తమ ఇంటి విషయమని, కుటుంబ వివాదమని చెప్పారని, దాంతో వెనుతిరిగినట్లు సమాచారం.

కొద్దిసేపటికే మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్‌ దాడి చేసినట్లుగా మనోజ్‌ పేరుతో ఒక ప్రకటన బయటకు వచి్చంది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటిది ఏం జరగలేదని మంచు కుటుంబం పేరుతో మరో ప్రకటన వచి్చంది. దీంతో మనోజ్‌పై దాడి ఊహాజనితం అయి ఉండచ్చని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే మనోజ్‌ తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చారు. 

కాలికి, మెడపై స్వల్ప గాయాలు 
భార్య, సహాయకుడి సహకారంతో మనోజ్‌ కుంటుతూ లోనికి వెళ్లడంతో ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమయ్యింది. భూమా మౌనిక మాత్రం సాధారణంగానే కనిపించారు. మనోజ్‌ కాలికి గాయమైందని, మెడపై కూడా స్పల్ప గాయాలున్నట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి కొందరు సినీ, రాజకీయ పెద్దలు మంచు కుటుంబ సమస్యల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలన్నింటిపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)