Breaking News

ముమ్మా..నిన్ను మిస్సవుతున్నా..

Published on Wed, 08/14/2024 - 07:03

సుభాష్‌నగర్‌: ‘‘ముమ్మా నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. నీవు లేకుండా అసలు అయితలే..నేను నీ దగ్గరకే వచ్చేస్తున్నా.. మన మధ్య మనస్పర్థలు సృష్టించారు., నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుంది..  అరేయ్‌ రాజురెడ్డి అన్నింటికీ నీవే కారణం, ఇద్దరం పెళ్లి చేసుకునేందుకు వెళ్లాం. తేజు లేనిదే  నేను లేను.. నాది వన్‌ సైడ్‌ లవ్‌ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణం. ముమ్మా నీ దగ్గరికే వస్తున్నా శ్రీ.. అక్క నీవే మమ్మీని చూసుకో’’.. అంటూ.. ఓ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే.. 

ఈ నెల 9న దోమడుగుకు చెందిన తేజస్వి అనే యువతి ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తేజస్వి ఆత్మహత్యకు శ్రీహరి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీహరి సోమవారం రాత్రి ఆస్పత్రి నుండి తప్పించుకున్నాడు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం బహదూర్‌పల్లిలోని సాయినా సొసైటీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని శ్రీహరిగా గుర్తించారు. ఘటనా స్థలంలో శ్రీహరి రాసిన సుసైడ్‌ నోట్‌ స్వా«దీనం చేసుకున్నారు. అందులో తాను, తేజస్వీ ప్రేమించుకున్నామని, బీజేపీ నాయకుడు రాజురెడ్డి, తేజస్వీ తండ్రి, సోదరుడు తమను విడదీసేందుకు యతి్నంచారని పేర్కొన్నాడు. తేజస్వీ లేనిదే తాను లేనని, తాను కూడా ఆమె దగ్గరకే వెళ్తున్నానని, తమ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అందులో పేర్కొన్నాడు. పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)