Breaking News

అజయ్‌ కోసం హుస్సేన్‌ సాగర్‌లో గాలింపు

Published on Mon, 01/27/2025 - 09:45

హైదరాబాద్‌, సాక్షి: ట్యాంక్‌ బండ్‌ బోట్ల దగ్ధం ఘటన తర్వాత  అజయ్‌ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్‌ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. 

కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్‌(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్‌ ట్యాంక్‌ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం  ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 

అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్‌ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

ఘటనపై కేసు నమోదు
హుస్సేన్‌ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్‌ ఫిర్యాదుతో లేక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

అసలేం జరిగిందంటే.. 
ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. 

అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్‌ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)