‘నా చావుకు భార్య, బావమరిది, అత్తలే కారణం’

Published on Thu, 12/12/2024 - 08:27

శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. 

వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్‌(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్‌ నకిరేకల్‌లో మొబైల్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్‌తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్‌ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. 

వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్‌ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. 

స్టేటస్‌ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రశాంత్‌ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)