Breaking News

నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్‌!

Published on Wed, 02/19/2025 - 13:32

ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఎస్సై సునీల్‌ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్‌ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్‌ అంకుష్‌కు ఫోన్‌ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా..  ఏం చేస్తావో చేయ్‌..అంటూ సవాల్‌ విసిరాడు. అంకుష్‌ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 

తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్‌ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)