Breaking News

ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

Published on Tue, 11/25/2025 - 05:35

శామీర్‌పేట్‌: ఓఆర్‌ఆర్‌ రోడ్డుపై పక్కన ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సోమ­వారం తెల్లవారుజామున మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్‌ (34) వృత్తి రీత్యా ఓ టీవీ చానెల్‌ నడుపుతున్నారు. పని నిమిత్తం ఆదివారం రాత్రి టీఎస్‌ 03 ఎఫ్‌డీ 7688 నంబరు గల ఇకో స్పోర్ట్స్‌ కారులో నగరానికి వచ్చారు.

రాత్రి మియాపూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉండి ఉదయం 4:30 నిమిషాలకు ఓఆర్‌ఆర్‌ మీదుగా తన స్వగృహానికి బయల్దేరాడు. ఈ క్రమంలో శామీర్‌పేట పరిధిలోకి రాగానే కారును రోడ్డు పక్కన ఆపగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారులో పూర్తిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దుర్గాప్రసాద్‌ పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అగి్నమాపక, పోలీసుశాఖ అధికారులు మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే దుర్గాప్రసాద్‌ పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారారని, క్లూస్‌ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఆగి ఉన్నపుడే మంటలు వ్యాపించినట్లు గుర్తించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని శామీర్‌పేట సీఐ శ్రీనాథ్‌ వెల్లడించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)