Breaking News

ప్రేమించాడు.. పెళ్లి అన్నాడు.. ఆపై తిరస్కరించాడు..?

Published on Mon, 09/23/2024 - 08:16

జ్యోతినగర్‌(రామగుండం): యువతీ, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు పెద్ద మనుషులు వెలకట్టిన ఉదంతం ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎన్టీపీసీ రామగుండం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే ఓ యువతి, యువకుడు కులాలు వేరైనప్పటికీ మనసులు కలిసి ప్రేమించుకున్నారు. 

మూడేళ్లుగా తమ ప్రేమను పంచుకుని పెళ్లి చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంతలోనే వారి మధ్యలో కొంత మనస్పర్థలు రావడంతో యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో బాధితురాలు యువకుడి ఇంటి ఎదుట నిరసన సైతం చేపట్టింది. ఇరువురి విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. 

ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ వారిద్దరి పెళ్లి జరుగకపోగా వారి ప్రేమను విడగొట్టడానికి కొంతమంది పెద్దలు రూ.9 లక్షలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ప్రేమకు వెలకట్టిన క్రమంలో రూ.4లక్షలు సైతం యువతి బంధువులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెళ్లి చేసుకోవాలని యువకుడిని యువతి వేడుకున్నా.. యువకుడిది ఉన్నత కుటుంబం కావడంతో ఎట్టకేలకు యువతి ప్రేమకు వెలకట్టారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)