Breaking News

ఆమెకు ఆయనే కనుపాప! యస్‌.. భరించేవాడే భర్త!!

Published on Sat, 03/22/2025 - 14:39

సోషల్‌ మీడియా జమానాలో చీటికిమాటికి గొడవలు పడి వేరు కాపురాల దగ్గరి నుంచి.. విడాకుల లాంటి తీవ్ర నిర్ణయాల దాకా వెళ్తున్న జంటలు షరామాములుగా మారిపోయాయి. ఈ తరుణంలో భార్యభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచే జంటలూ అక్కడక్కడా.. అప్పుడప్పుడే మనకు కనిపిస్తున్నాయి. అదిగో అలాంటి అరుదైన జంట గురించి.. భార్య మీద అపరిమితమైన ప్రేమ ఉన్న గొప్ప భర్త గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. 

భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు?. ఎవరి సంగతి ఎందుకోలేండి.. ఇక్కడ.. ఈ భర్త మాత్రం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా తన భార్య, కూతురు.. ఇద్దరినీ తన వెంటే ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. 

వెంకటేష్ నందిని.. సొంతూరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. గత ఏడు సంవత్సరాలుగా వలసజీవనానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతానికి.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నివాసముంటున్నారట. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి  వర్ధన్నపేట వద్ద సాక్షి వర్ధన్నపేట రిపోర్టర్‌ అజీజుద్దీన్‌కు కనిపించారు. వాళ్లను పలకరించగా.. 

చాన్నాళ్లుగా నందినికి ఫిట్స్‌ ఉందట. ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్తే.. ఆమెకు జరగరానిది ఏదైనా జరుగుతుందేమోనని ఆయన భయమట. అందుకే నందినితో పాటు కుమార్తె ఆదిలక్ష్మిని ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తీసుకెళ్తూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. 

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి