Breaking News

పెళ్లి చేసుకోవాలని వివాహితపై ఒత్తిడి.. ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో

Published on Tue, 01/03/2023 - 21:23

సాక్షి, రంగారెడ్డి: ఫేస్‌ బుక్‌ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది.

ఈమెకు ఫేస్‌బుక్‌ ద్వారా మంచాల మండలం రంగాపూర్‌కు చెందిన శివకాంత్‌(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్‌తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.   
చదవండి: Hyderabad: ఫుడ్‌ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్‌ వెంటపడి మరీ..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)