Breaking News

సివిల్స్‌ అభ్యర్థులకు ఎంతైనా సహకరిస్తాం

Published on Tue, 08/12/2025 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: సివిల్స్‌ సాధించాలనుకునే అభ్యర్థులకు ఎంతయినా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ విద్యార్థులే అత్యధికంగా ఎంపిక అవ్వాలని ఆయన అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ‘రాజీవ్‌ సివిల్స్‌ అభయ హస్తం’పథకం పేరుతో సివిల్స్‌ మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే 178 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రజాభవన్‌లో జరిగింది. చెక్కులు అందించిన అనంతరం భట్టి మాట్లాడారు. 

సమాజంలో మానవ వనరులే బలమైన పెట్టుబడులని, వీటిని సానబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం, ఢిల్లీలో వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక తోడ్పాటునిచ్చినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ప్రజల జీవన స్థితిగతులను వీరే మార్చగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఎక్కువ మంది ఎంపికవ్వాలి: కోమటిరెడ్డి 
విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికైతే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఈ పథకం సహాయంతో సివిల్స్‌లో విజయం సాధించి, పరిపాలన విభాగంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. 

ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ మాట్లాడుతూ పేదింటి పిల్లలు కూడా సివిల్స్‌లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 2024లో తెలంగాణ ప్రాంతం నుంచి సివిల్స్‌ విజేతలైన 30 మందికి ఈ సందర్భంగా మెమెంటోలను బహూకరించారు. వరంగల్‌కు చెందిన ఎట్టబోయిన సాయిశివాని సివిల్స్‌లో 11వ ర్యాంక్‌ సాధించడంపై ముఖ్యఅతిథులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)