Breaking News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌కు షాక్‌.. కేసు నమోదు

Published on Fri, 01/02/2026 - 09:47

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డికి(Kotha prabhakar reddy) బిగ్‌ షాక్‌ తగలింది. దుర్గం చెరువు అక్రమ ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌, ఆయన సోదరుడు వెంకట్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టినట్టు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

వివరాల మేరకు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు.. దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపేసినట్టు హైడ్రా(HYDRA) సూపర్‌వైజర్‌ కాంత్రి ఆనంద్‌, హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో, ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండగా.. అక్రమంగా ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్‌టీఎస్‌ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు పార్కింగ్‌కు వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, ఈ భూమి వ్యవహారంలో 2014లో హెచ్‌ఎండీఏ ఎఫ్‌టీఎల్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు భూమి ఆక్రమించినట్టు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఇలా ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం(రెంటుకు ఇవ్వడం) పొందుతున్నారని ఆరోపించారు. దీంతో, మాదాపూర్‌ పోలీసులు.. ప్రభాకర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డిపై BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్-3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)