Breaking News

ఎల్‌ఆర్‌ఎస్‌ ఇప్పట్లో తేలేనా?

Published on Fri, 06/06/2025 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: అనధికార లేఅవుట్‌లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. లక్షలాది మంది తమ ప్లాట్లు అనధికార లేఅవుట్‌లలో ఉన్నాయని తెలిసినా, క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ కింద గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది. దాదాపు మూడు నెలలుగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 

క్రమబద్ధీకరణకు యోగ్యమైనవిగా అధికారులు నిర్ణయించిన వాటిలో ఇప్పటివరకు కనీసం 25 శాతం ప్లాట్ల దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. 2020లో మొత్తం 25,67 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 20,11 లక్షల దరఖాస్తులు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నవిగా తేల్చిన అధికారులు.. ఆ మేరకు సంబంధిత ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చారు. 

మీరు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లిస్తే.. ఈ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. తద్వారా కనీసం రూ.పదివేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావించింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఫీజు చెల్లింపు గడువును మూడుసార్లు పొడిగించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2020 కటాఫ్‌ ఏడాది తర్వాత ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో 46,255 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమబద్ధీకరణకు యోగ్యమైన 20.11 లక్షల దరఖాస్తుల్లో ఫీజులు చెల్లించిన వారు కేవలం 5,77 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నవారు ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. 

డబ్బు చెల్లించిన తర్వాత.. 
జరిమానా రూపంలో డబ్బు చెల్లించిన 5.77 లక్షలలో ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ చేసినవి 1,77,435 వరకు ఉన్నాయి. ఫీజుల చెల్లించి, మిగిలిన పత్రాలు సరిగా జతచేయని వారిని నుంచి అవసరమైన పత్రాల కోసం అధికారులు వారికి మళ్లీ సమాచారం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనధికార లేఅవుట్‌లు, ప్లాట్లు అధికంగా ఉన్న జిల్లాలు, అక్కడ నుంచి వచ్చిన దరఖాస్తులు, చెల్లించిన ఫీజులు చూస్తే.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అత్యధికంగా అనధికార లేఅవుట్‌లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. 

ఇప్పటి వరకు ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తాల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో, రెండోస్థానం మేడ్చల్, మూడోస్థానంలో హెచ్‌ఎండీఏ నాలుగో స్థానంలో జీహెచ్‌ఎంసీ, ఐదోస్థానంలో వరంగల్‌ అర్బన్, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. పురపాలక శాఖలోని అధికారుల పాత్ర లేకుండా వేల లేఅవుట్‌లు, ప్లాట్లు రావడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యల్పంగా ఆదాయం సమకూరిన జిల్లా ములుగు అయితే..అత్యధిక ఆదాయం వచ్చిన జిల్లా రంగారెడ్డి.  

మరోసారి పొడిగింపు.. 
ప్రజలకు తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫైల్‌ పంపినట్టు చెబుతున్నారు. గతవారంలో పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎంఓలో పురపాలక వ్యవహారాల చూసే మాణిక్‌రాజ్‌లు లేని కారణంగా పొడిగింపు ఉత్తర్వులు రాలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిసింది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)