Breaking News

పంటలకు వానలా నీళ్లు!

Published on Tue, 12/31/2024 - 00:49

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్‌లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్‌ లీనియర్‌ ఇరిగేషన్‌’విధానాన్ని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.

తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..
ప్రస్తుతం ఇక్రిశాట్‌లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్‌ పివోట్‌ లీనియర్‌ ఇరిగేషన్‌’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్‌లీనియర్‌ ఇరిగేషన్‌ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.

ప్రయోజనాలు ఎన్నెన్నో...
ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్‌ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.

పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్‌ ఉంటాయి.

 పొలంలోని బోరు/ మోటార్‌ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్‌ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్‌ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.

ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.

⇒  రోలర్లను రిమోట్‌ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్‌ ద్వారా కూడా ఆపరేట్‌ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.

‘పివోట్‌ లీనియర్‌ ఇరిగేషన్‌’విధానం ఇదీ..
కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు