Breaking News

ఇక కొత్త సర్వే మాన్యువల్‌!

Published on Mon, 08/18/2025 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భూముల హద్దును నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్‌ను రూ­పొందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, ప్రజాపాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జరిగే సర్వేలు పారదర్శకంగా ఉండేందుకు గాను తాజా నిబంధనలు తయారు చేయాలని, సర్వే మాన్యువల్‌ తయారీకి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని కోరా­రు. ఆదివారం సర్వే విభాగంపై సమీక్ష సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. 

అక్టోబర్‌ 2 నుంచి లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థ 
అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో లైసెన్సుడు సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. లైసెన్సుడు సర్వేయర్ల నియామకంలో భాగంగా ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో 7 వేల మందికి తొలి విడత శిక్షణ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. గత నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటిస్‌ శిక్షణ కూడా పూర్తి చేశామని చెప్పారు. 

రెండోదశ శిక్షణ ఈ నెల 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నామని, ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్లకు రిపోర్టు చేయాలని సూచించారు. భూ భారతి చట్టంలో భాగంగా రిజి్రస్టేషన్ల సమయంలో సర్వే మ్యాప్‌ తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, సర్వే విభాగాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా లైసెన్సుడు సర్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని పొంగులేటి వివరించారు. 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)