Breaking News

15 నిమిషాల్లోనే ల్యాండ్‌ రిజిస్ట్రేష‌న్‌

Published on Wed, 04/09/2025 - 19:36

సాక్షి, హైద‌రాబాద్‌: స్థిరాస్తి రిజిస్ట్రేష‌న్లు మరింత సులువు కానున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేష‌న్‌ల శాఖ సరికొత్త సంస్కరణలో భాగంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా మహా హైదరాబాద్‌ (Hyderabad) పరిధిలోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ(గురువారం) నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు కానుంది. గ్రేటర్‌ పరిధిలోని ఆజంపుర, చిక్కడపల్లి, మేడ్చల్‌ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్‌ నగర్, శంషాబాద్, సరూర్‌ నగర్, చంపాపేట్‌ సబ్‌ రిజిస్ట్రేష‌న్‌ ఆఫీసుల్లో  స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలుకు రిజిస్ట్రేషన్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
 
రోజుకు కనీసం 48 స్లాట్లు 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేష‌న్‌ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయా నికి కనీసం రోజు వారి పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజుదారులు నేరుగా registration.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్‌ ఇన్‌ రిజిస్ట్రేష‌న్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తారు.

144 స్లాట్ల వరకు.. 
గ్రేటర్‌ పరిధిలో స్థిరాస్తి దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్‌ రిజిస్ట్రేష‌న్‌ ఆఫీసుల్లో అత్యధికంగా స్లాట్స్‌ అందుబాటులో ఉంటాయి. 48 స్లాట్స్‌ కన్నా ఎక్కువ స్లాట్స్‌ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్‌ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్‌ రిజిస్ట్రార్లను నియమిస్తారు.  ప్రయోగాత్మకంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ ఆఫీసుల్లో అదనంగా ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించారు. ఈ  కార్యాలయంలో 144 స్లాట్స్‌ అందుబాటులో ఉంటాయి. 

చ‌ద‌వండి: శామీర్‌పేట్‌ కారిడార్‌పై పీటముడి.. హెచ్‌ఎండీఏ తర్జనభర్జన

మరోవైపు స్లాట్‌ బుకింగ్‌ (Slot Booking) విధానాన్ని దష్టిలో పెట్టుకొని సబ్‌  రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్‌ చేశారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట–సరూర్‌నగర్‌ సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశారు.

సొంతంగానే.. 
స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డ్యాకుమెంట్‌ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో ఒక మాడ్యూల్‌ని ప్రవేశపెట్టారు. మొదటగా సేల్‌ డీడ్‌ (Sale Deed) దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేష‌న్‌ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు సబ్‌ రిజిస్ట్రార్‌ సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడానికి రిజిస్ట్రేష‌న్‌ (registration) ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్‌ ఇ–సిగ్నేచర్‌ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈనెల చివరిలోగా అందుబాటులోకి రానుంది.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)