వదిన గొంతు కోసిన మరిది

Published on Wed, 02/25/2026 - 07:32

యాదాద్రి భువనగిరి జిల్లా: భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్‌కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్‌ వెంకటమ్మతో అశోక్‌ తరచూ గొడవకు దిగేవాడు. 

ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్‌ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్‌ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్‌ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. 

ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)