Breaking News

కుషాయిగూడలో దారుణం.. అర్ధరాత్రి అక్కఇంట్లోనే భార్యను...

Published on Sun, 09/21/2025 - 07:48

కుషాయిగూడ(హైదరాబాద్‌): భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి నిద్రిస్తున్న ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అణుపురంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా, అడ్డగూడురు గ్రామానికి చెందిన బోడ శంకర్‌కు అదే మండలం గోవిందపురం గ్రామానికి చెందిన మంజులతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శంకర్‌ పెళ్లికి ముందు నుంచే ముంబైలోని అక్క ఇంట్లో ఉంటూ ఫ్లంబర్‌గా పనిచేసేవాడు. వివాహం అనంతరం భార్య మంజులను ముంబై తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై శంకర్‌ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో శంకర్‌ తరచూ భార్యను  శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక మంజుల ఈ నెల 14న ముంబై నుంచి ఏఎస్‌రావునగర్, అణుపురం కాలనీలో ఉంటున్న అక్క రాణి ఇంటికి వచి్చంది. దీంతో శంకర్‌ కూడా తన చిన్న కొడుకును వెంట తీసుకొని ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చి భార్యను కలిశాడు. శుక్రవారం రాత్రి  మంజులకు వరుసకు సోదరుడైన తోటకూర నగేష్‌ ఇంట్లో పంచాయతీ చేసిన పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం అందరూ కలిసి రాణి ఇంటికి తిరిగి వెళ్లారు. అందరూ నిద్రిస్తుండగా శంకర్‌ తన పక్కనే పడుకున్న మంజులపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు.

 మంజుల కేకలు విని కుటుంబ సభ్యులు  మేల్కొనడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతురాలి సోదరుడు   భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య అనంతరం నిందితుడు ఇంటి నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)