Breaking News

బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!

Published on Mon, 06/23/2025 - 09:01

కర్నూలు: కర్నూలు టీజే మాల్‌లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్‌ గంట తేజేశ్వర్‌ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్‌ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ సర్వేయర్‌ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్‌ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్‌ తేజేశ్వర్‌ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్‌ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. 

బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్‌ ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వ‌ద్ద‌ తేజేశ్వర్‌ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి 
పాణ్యం: తేజేశ్వర్‌ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. కారులోనే  తేజేశ్వర్‌ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్‌ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు  సమాచారం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)