Breaking News

అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు

Published on Wed, 04/23/2025 - 08:53

కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్‌): కూతురు పెళ్లి విషయంలో తలదూర్చవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను కరెంటు షాక్‌ పెట్టి హత్య చేసిన కేసులో భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డిలు హత్య కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లింగాయపల్లికి చెందిన సాయిలును భార్య కవిత గత శుక్రవారం రాత్రి పథకం ప్రకారం విద్యుత్‌ షాక్‌ ఇచ్చి హత్య చేసిన విషయం విదితమే. 

ఈ కేసులో కవితకు సహకరించిన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కవర్‌లో చుట్టి ఆటోలో తరలించి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నంచగా ఆటో డ్రైవర్‌ నిలదీయడంతో తిరిగి వారు నివాసం ఉంటున్న మిత్ర హిల్స్‌కు చేరుకొని అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అనంతరం ఆటో డ్రైవర్‌ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లను స్వా«దీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

గుట్టు రట్టు చేసిన ఆటో డ్రైవర్‌... 
కవర్‌లో మూటకట్టిన మృతదేహాన్ని చెత్త కుప్పగా నమ్మించి సంగారెడ్డి చెరువులో పడవేసేందుకు ఆటోను మాట్లాడుకొని శనివారం రాత్రి బయలుదేరి వెళ్లగా నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు యతి్నస్తున్న విషయాన్ని ఆటోడ్రైవర్‌ వలీనాయక్‌ కనిపెట్టాడు. అనుమానం వచ్చి కవితను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె తిరిగి తమను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దించాలని చెప్పడంతో మిత్రహిల్స్‌ వద్ద దించాడు. అప్పటికే కవర్‌లో మూటగట్టిన మృతదేహం వాసన రావడంతో అనుమానం వచి్చన ఆటోడ్రైవర్‌ వలీనాయక్‌ మరుసటి రోజు కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డిని కలిసి విషయం చెప్పాడు. దీంతో హత్య కేసు గుట్టు రట్టయింది. ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిన వలీనాయక్‌ను పోలీస్‌ అధికారులు అభినందించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)