Breaking News

‘కంచ’ పోరు ఆగదు

Published on Mon, 04/07/2025 - 05:56

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని శాశ్వతంగా కాపాడుకునేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న అపూర్వ పోరాటంపై ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. విద్యార్థులు నిస్వార్థంగా, ఉదాత్త లక్ష్యాలతో చేపట్టిన ఈ ఆందోళన అద్భుతమని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ దళారిలా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్‌ కోసం కంచ గచ్చిబౌలి స్థలం వేలాన్ని విరమించుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఎకో పార్క్‌ ఏర్పాటు, యూనివర్సిటీ తరలింపు వంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. 50 ఏళ్లకు పైగా సెంట్రల్‌ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, ఎకో పార్క్‌ కన్నా గొప్పగా ఈ క్యాంపస్‌ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోందన్నారు. 

400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలే ఉందని, ప్రభుత్వ బెదిరింపులను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. 400 ఎకరాల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని, విద్యార్థులకు అండగా నిలుస్తుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)