Breaking News

రేవంత్‌.. లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?

Published on Sat, 06/14/2025 - 04:15

సాక్షి, హైదరాబాద్‌: ‘రేవంత్‌రెడ్డి గారూ.. ఓటుకు నోటు కేసులో మీరు..ఫార్ములా ఈ అంశంలో నేను.. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. న్యాయమూర్తి సమక్షంలో మనిద్దరం లై డిటెక్టర్‌ పరీక్ష ఎందుకు చేయించుకోకూడదు. ఈ పరీక్షను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే అసలు దోషులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నాతోపాటు లై డిటెక్టర్‌ పరీక్షకు హాజరయ్యే దమ్ముందా’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాలు చేశారు. శుక్రవారం ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ స్పందించారు. ‘ప్రభుత్వం నడిపే చేవలేనప్పుడు ప్రజలతో సర్కస్‌ చేస్తూ వారి దృష్టిని మళ్లిస్తారు.

కానీ కాంగ్రెస్‌ పార్టీతోపాటు దాని జోకర్‌ సీఎం చేసే హడావుడి మమ్ములను అడ్డుకోలేవు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా–ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. చట్టానికి కట్టుబడిన పౌరుడిగా విచారణకు హాజరై ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నల్లటి బ్యాగ్‌ నిండా డబ్బుతో దొరికి పదేళ్లు పూర్తి చేసుకున్నదెవరో చెప్పగలరా. ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న సీఎం రేవంత్‌.. పదే పదే విచారణలు, ప్రచారాలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

విద్యా వ్యవస్థపై బాధ్యత లేదు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు. దీని పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. వానాకాలం సీజన్‌ మొదలవుతున్నా రైతు­భరోసా అమలు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. పాఠశాలలు పునః ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. 

ఎమ్మెల్యే పల్లాకు పరామర్శ
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జన­గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్‌ పరామర్శించా­రు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు దాసో­జు శ్రవణ్, తాతా మధు, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)