Breaking News

తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

Published on Sat, 04/01/2023 - 21:06

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలకు పెద్ద‌పీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మీద ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్‌ శంకర్‌, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం దసరా అలాంటి కోవకే చెందుతుంది. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతోపాటు కమర్షియల్​గానూ మంచి విజయం సాధిస్తున్నాయి

ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస కనిపించడంపై మంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి మెసెజ్‌ చేశారు. ‘డియ‌ర్ కేటీఆర్‌ గారు. మీతో రెండు విష‌యాలు పంచుకోవాల‌నుకుంటున్నాను. తెలంగాణ యాస‌లో ఇప్పుడు సినిమాలు రావ‌డం, అవి అద్భుతంగా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు బ‌లగం, ద‌స‌రా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే ద‌క్కుతుంది.

మరో విషయం ఏంటంటే నాకు 68 ఏళ్లు.. ఇలాంటి సినిమాలు వ‌స్తాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విల‌న్లు, జోక‌ర్స్ గా చూపిచండంతో.. గ‌త 20 ఏళ్ల నుంచి సినిమా థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేశాను’  అని డాక్ట‌ర్ దండే శ్రీరాములు అనే వ్య‌క్తి కేటీఆర్‌కు వాట్సాప్ మెసెజ్‌ చేశారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అనుమతితో మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. దీనికి శ్రీరాములు కూడా స్పందింస్తూ.. త‌ప్ప‌కుండా స‌ర్. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల‌వుతాను. మీరు మ‌మ్మ‌ల్ని అడ‌గ‌డం మీ మంచిత‌నానికి నిద‌ర్శ‌నం. థాంక్యూ వెరి మ‌చ్ స‌ర్ అంటూ పేర్కొన్నారు.

దీనిని కేటీఆర్ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పున‌రుజ్జీవ‌నానికి కార‌ణ‌మైన కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌ను హేళ‌న చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంది’ అని కేటీఆర్ తెలిపారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు