నీళ్లు చంద్రబాబుకు.. నిధులు రాహుల్‌కు

Published on Mon, 07/28/2025 - 04:54

సాక్షిప్రతినిధి, వరంగల్‌: తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు కల్పిస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నారా చంద్రబాబునాయుడికి, నిధులు రాహుల్‌గాంధీకి, నియామకాలు చంద్రబాబు తొత్తులకు ఇస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగి ప్రజాధనం లూటీ అవుతోందని ఆరోపించారు. కేటీఆర్‌ ఆదివారం హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. 

గిప్ట్‌ ఏ స్మైల్‌ కింద పరకాలలో ‘పోచంపల్లి పౌండేషన్‌’ఆధ్వర్యంలో మహిళలకు కేసీఆర్‌ కిట్లు, కుట్టు మెషీన్లు పంపిణీ చేశారు. అనంతరం పరకాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సదస్సులో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లో 111 మంది గురుకుల విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయినట్టు తెలిసిందని ఆందోళన వ్యక్తంచేశారు. 

20 నెలల కాంగ్రెస్‌ పాలనలో పదుల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాంటి విషాహారమే పెడతారా? అని ప్రశ్నించారు. అందాల పోటీలకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారిని చూసి సొంగకార్చే వారి కోసం ఒక్కో భోజనానికి రూ.లక్ష చెల్లించిన ఈ ప్రభుత్వం.. విద్యార్థులకు రూ.150 వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. 

కాళేశ్వరం కుట్ర వెనుక కాంగ్రెస్‌ ఉందేమో.. 
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఫియర్‌లు కుంగడానికి కాంగ్రెస్‌ నేతలే కుట్రచేశారా? అన్న అనుమానం కలుగుతోందని కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్‌ పార్కులో రూ.137 కోట్ల అంచనాలు కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ.297 కోట్లకు పెరిగాయని ఆరోపించారు. కాల్వ నిర్మాణం పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.167 కోట్లు దోచుకోవాలనుకున్నారని ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల బాకీ ఉందని కేటీఆర్‌ అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులకు ఆడబిడ్డలు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్‌ లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే చూస్తున్నానని దుయ్యబట్టారు. కేటీఆర్‌ వెంట ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఉన్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)