Breaking News

అర్జున్‌రెడ్డి హిట్‌.. రేవంత్‌రెడ్డి ఫట్‌

Published on Mon, 06/22/2026 - 06:07

శంషాబాద్‌: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్‌ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్‌ అయ్యింది. సినిమా ఫ్లాప్‌ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు విమర్శించారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్‌’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్‌ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 

రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్‌ బంధు మా త్రమే ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్‌ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్‌ ప్రక్రియను బూత్‌ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)