Breaking News

పాలమూరుపై పగ.. కాళేశ్వరంపై కక్ష

Published on Mon, 12/29/2025 - 03:48

నాగర్‌కర్నూల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై పగ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష పెంచుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో ఇటీవల గెలిచిన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని హామీలు అమలు చేయాలని అడుగుతుంటే బూతులు తిడుతున్నాడని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో 90% పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తట్టెడు మట్టి ఎత్తలేదని.. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే దాన్ని పూర్తి చేయట్లేదని కేటీఆర్‌ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాత బాస్‌ చెప్పినట్లు ఆడుతున్నారని, అందుకే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. 

ఆంధ్రలో నేను చదువుకుంటే తప్పా..? 
మాట్లాడితే తాను ఆంధ్రలో చదివానని సీఎం విమర్శిస్తున్నారని.. కానీ రేవంత్‌ ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదంటగానీ తాను ఆంధ్రలో చదువుకుంటే తప్పా అని కేటీఆర్‌ నిలదీశారు. 40 ఏళ్ల క్రితం తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చదువుకుంటేనే జీవితం బాగుంటుందని తండ్రి చెప్పడంతో విదేశాల్లో చదువుకున్నానని చెప్పారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వారే చేసుకుంటారని కేటీఆర్‌ వివరించారు.

తాను అమెరికాలో బాత్రూంలు కడిగానంటూ సీఎం విమర్శిస్తున్నాడని.. కానీ ఆయన సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటారని.. మరి ఆ లెక్కన ఆయన కూడా అక్కడ బాత్రూంలు కడుగుతున్నట్టేనా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ఏం అడిగినా అరుస్తున్నారని, కొన్ని రోజులైతే కరుస్తారేమోనని.. అందుకే ఆయన్ను ఇంట్లో కట్టేయాలని ముఖ్యమంత్రి భార్య గీతమ్మకు కోరుతున్నానన్నారు. హైదరాబాద్‌ చుట్టూ 9,300 ఎకరాల భూములపై రేవంత్‌ కన్నేసి రూ. 5 లక్షల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాటన్నింటినీ వెలికితీస్తున్నందుకే రేవంత్‌రెడ్డి తమపై చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యారు.. 
చీకటి, దొంగ ఒక్కటైనట్లు బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా బీజేపీ ఏం మాట్లాడట్లేదని విమర్శించారు. ఆ రెండు పారీ్టలు అలయ్‌–బలయ్‌ చేసుకొని బీఆర్‌ఎస్‌నే తిడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వనని రేవంత్‌రెడ్డి శపథం చేస్తున్నారని.. అయితే ఆయన కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ. 2,500, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇస్తామని శపథం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్, హర్షవర్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
28ఎన్‌జికెఎల్‌51: మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)