Breaking News

కేటీఆర్‌ వర్సెస్‌ కలెక్టర్‌!

Published on Wed, 02/26/2025 - 12:17

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యహరించే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. భూకబ్జాలు, అనుమతిలేని వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో వింతేమీలేదు. అయితే.. బాధితులంతా తాము కేటీఆర్‌ అనుచరులం, బీఆర్‌ఎస్‌ నాయకులం కాబట్టే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇటీవల కేటీఆర్‌ సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ను సన్నాసి.. ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి తమపై కలెక్టర్‌ దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్‌ అనుచరులు ఆరోపిస్తుండగా..తనపని తానుచేసుకుంటున్నానే తప్ప.. ఎలాంటి ప్రతీకారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సమాధానమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఇప్పుడు రాజ కీయరంగు పులుముకుంటోంది. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝాపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా బీఆర్‌ఎస్‌ నాయకులు సీఎస్‌ శాంతికుమారిని కలవడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.

  • కేటీఆర్‌ అనుచరులు ఏమంటున్నారు?
     టీస్టాల్‌ వద్ద కేటీఆర్‌ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్‌ యజమానికి బత్తుల శ్రీనివాస్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

  •  కరీంనగర్‌ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్‌ సీజ్‌ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్‌చేశారని ఆరోపించారు.

  •  కలెక్టర్‌ తీరుపై తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి (గతంలో కేఏపాల్‌ మీద దాడిచేసిన వ్యక్తి) సందీప్‌కుమార్‌ ఝా మీద కేసులున్నాయని సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అతను పోలీసులకు చిక్కకపోవడంతో అతని చిన్నాన్న అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల స్థలం కబ్జాచేశాడని పోలీసులు అరెస్టు చేశారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం లేకుండా పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

  •  2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌన్సెలింగ్‌ లేకుండానే కలెక్టర్‌ అపాయింట్మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చాడు. నిబంధలనకు విరుద్ధమని చెప్పిన డీఈవోను కలెక్టర్‌ బెదిరించారు. ఉంటే ఉండు లేకుంటే లీవులో వెళ్లంటూ హెచ్చరించారు.

  • ఆరోపణలపై కలెక్టర్‌ ఏమన్నారంటే..
     సిరిసిల్లలో పబ్లిక్‌ ప్రాంతాన్ని టీస్టాల్‌ యజమాని ఆక్రమించి నడుపుతున్నాడు. పైగాఅతనికి ఎలాంటి ట్రేడ్‌ లైసెన్స్‌ లేదు. అతను ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు.

  •  కరీంనగర్‌ డెయిరీకి అనుబంధంగా ఉన్న అగ్రహారం డెయిరీ లైసెన్స్‌ లేకుండా నడుస్తోంది. దా నికి ఫైర్‌ సేఫ్టీ లైసెన్స్‌, ల్యాండ్‌ కన్వర్షన్‌, బిల్డింగ్‌ పర్మిషన్‌, పర్యావరణ అనుమతులు లేవు.

  •  తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సర్వే నెంబరు 1,183లోని స్థలాన్ని రాజిరెడ్డికి ప్రభుత్వం అసైన్‌ చేయలేదు. 2018లో ప్రభుత్వ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి తనపేరిట మార్చుకున్నాడు. ఇది అవినీతి వ్యవహారం.

  •  వాస్తవానికి జగన్మోహన్‌రెడ్డి విధులపై అంకితభావం లేదు. నాకు తెలియకుండా డీఈవో ఆర్డర్స్‌ ఇచ్చారు. అదేంటని అడిగితే.. పైనుంచి ఆర్డర్స్‌ ఉన్నాయని సమాధానమిచ్చాడు. జిల్లా సర్వశిక్షాభియాన్‌ చైర్మన్‌గా నేను ఉండగా.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడం, పైగా ఆ ఆదేశాలు నేను ఇచ్చానని ప్రచారం చేయడం ఎంతమేరకు సమంజసం?

నిజాయితీకి దక్కిన బహుమానం
నేను ఎవరినీ టార్గెట్‌ చేయలేదు. నాకెలాంటి రాజకీయ కక్షలేదు. అందరూ సమానమే. నాపని నేను చేసుకుంటూ పోతున్న. అవినీతి, అక్రమార్కుల విషయంలో అధికారులు కూడా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం వారికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ.. మేము అక్రమాలపై చర్యలు తీసుకుంటుంటే కొందరు దుబాయ్‌ వేదికగా సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది నా నిజాయతీకి దక్కిన బహుమానం.
– సందీప్‌కుమార్‌ ఝా,కలెక్టర్‌, రాజన్న సిరిసిల్ల

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)