Breaking News

కార్మిక వ్యతిరేక విధానాలపై తెలంగాణ నుంచే పోరాటం

Published on Sun, 12/07/2025 - 03:24

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తెస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్, దాని అనుబంధ కార్మిక విభాగం బీఆర్‌టీయూ సిద్ధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కార్మిక సంఘాలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా తాము కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. 

ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని ప్రశి్నస్తూ, నూతన లేబర్‌ కోడ్లను తెలంగాణలో అమలు చేయవద్దని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించిన కేటీఆర్, అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, మన దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 

చైనా ఆర్థిక వ్యవస్థతో పోల్చుతూ, నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, కానీ నేడు అది 60 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, భారత్‌ మాత్రం ఇంకా 4 ట్రిలియన్ల వద్దే ఉందని కేటీఆర్‌ గుర్తు చేశారు. చైనా తన ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకుంటూ, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ మద్దతునిస్తూ, లాభాల్లో ఉన్నప్పుడు ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించిందని కేటీఆర్‌ చెప్పారు. 

కాగా, ఈ నూతన లేబర్‌ కోడ్‌లను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో తదుపరి సమావేశం నిర్వహిస్తామంటూ కార్యాచరణను కేటీఆర్‌ ప్రకటించారు.

కార్పొరేట్‌ ఏకాధిపత్యం ప్రమాదకరం.. 
దేశంలో పెరుగుతున్న కార్పొరేట్‌ ఏకాధిపత్యం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని కేటీఆర్‌ ఉదహరించారు. ఇది ముమ్మాటికీ శ్రమ దోపిడీ వల్లే జరిగిందని, అయినా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమలు చేయకుండా ఆ సంస్థ ఒత్తిడికి తలొగ్గిందని విమర్శించారు.  

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)