Breaking News

రేపటి నుంచి జూబ్లీహిల్స్‌లో కేటీఆర్‌ రోడ్‌ షోలు

Published on Thu, 10/30/2025 - 04:16

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు శుక్రవారం నుంచి క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రోజూ ఒక రోడ్‌ షోలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్‌ రోడ్‌ షోలు నవంబర్‌ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు నవంబర్‌ 9న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి వచ్చేలా షేక్‌పేట నుంచి బోరబండ వరకు బైక్‌ ర్యాలీకి పార్టీ వర్గాలు షెడ్యూలు సిద్ధం చేశాయి. 

కాగా, అక్టోబర్‌ 31న షేక్‌పేట, నవంబర్‌ 1న రహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్‌లో కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహిస్తారు. 7వ తేదీన రోడ్‌ షోకు విరామం ప్రకటించి మళ్లీ 8న షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌ డివిజన్లలో జరిగే రోడ్‌షోల్లో కేటీఆర్‌ పాల్గొంటారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా రోడ్‌ షోల్లో పాల్గొనాల్సి ఉండగా, ఇటీవల ఆయన తండ్రి మరణంతో ప్రచారానికి దూరమయ్యారు. అయితే వార్‌ రూమ్‌ సభ్యుడిగా ఉన్న హరీశ్‌రావు కొద్ది రోజుల్లో ప్రచార సమన్వయం, పర్యవేక్షణ చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

కీలక నేతలందరూ ప్రచారంలోనే.. 
ఉప ఎన్నిక ప్రచారం మరో పది రోజుల్లో ముగియనుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేయడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. నియోజకవర్గం పరిధిలోని 407 పోలింగ్‌ బూత్‌లను 61 క్లస్టర్లుగా విభజించి 69 మంది బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో సగటున నాలుగు నుంచి ఐదు పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. క్లస్టర్‌ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న వారిలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉన్నారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)