Breaking News

ప్రయత్నిస్తే మంచి ఫలితమే

Published on Wed, 04/10/2024 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. 

ఈ ఏడాదంతా కేసీఆర్‌కు బాగుంటుంది 
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్‌కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

అలా ఉంటే కేటీఆర్‌ ప్రజాభిమానాన్ని పొందుతారు 
 కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)