Breaking News

ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం

Published on Sun, 10/26/2025 - 06:00

సాక్షి, హైదరాబాద్‌/శ్రీనగర్‌కాలనీ: బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.

భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్‌ఎస్‌ నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్‌ సమస్యలపై అవగాహన ఉంది.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్‌ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్‌ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు. 

జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర
జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో షేక్‌పేట డివిజన్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)