Breaking News

రూ.100 కోట్ల దావా

Published on Wed, 03/29/2023 - 00:42

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌­రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. తనపై నిరా­ధారమైన, అసత్య ఆరోపణలు చేస్తు­న్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామా­రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారికి తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు. వారిద్దరూ తనపై చేసిన వ్యా­ఖ్య­లను వారం రోజుల్లోపు వెనక్కి తీసుకుని క్షమా­పణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా­ను ఎదుర్కోవా­ల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.  

వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు 
‘ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ టీవీ చానెళ్లతో పాటు డిజిటల్, సోషల్‌ మీడియాలో తన పరువుకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడారు. 2009 నుంచి 2018 వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేస్తున్న, విద్యావంతుడినైన నా ప్రతిష్టకు.. బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భంగం కలిగించాయి. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి..’ అని కేటీఆర్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

దురుద్దేశంతోనే పదేపదే అబద్ధాలు 
‘సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్య ప్రేలాపనలు చేసే హక్కు వీరికి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నా.

ఇప్పటికైనా ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దావాను ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్‌ రెడ్డిలు చేసిన ఆరోపణల వివరాలను నోటీసుల్లో కేటీఆర్‌ పొందుపరిచారు.  

ఇవే సెక్షన్ల కింద రాహుల్‌కు జైలు శిక్ష 
గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 కిందే కేసు నమోదైంది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులోనే రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. ఈ తీర్పు నేపథ్యంలోనే రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా సెక్రటేరియట్‌ ప్రకటించింది.

ప్రస్తుతం కేటీఆర్‌ కూడా ఇవే సెక్షన్ల కింద లోక్‌సభ సభ్యులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల స్థానిక చిరునామాలకు, అలాగే ఢిల్లీ చిరునామాలకు కూడా కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించారు.
 
ముందే హెచ్చరించి నోటీసులు 
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర పన్నాయని కేటీఆర్‌ పలు సందర్భాల్లో విమర్శించారు. తన వ్యక్తిగత సహాయకుడిపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను కూడా రెండు రోజుల క్రితం ఖండించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్రలను సహించేది లేదని పదే పదే చెప్పిన కేటీఆర్‌.. ఇద్దరు విపక్ష నేతలకు లీగల్‌ నోటీసులు ఇస్తానని ఈ నెల 23నే చెప్పారు. చెప్పినట్టుగానే మంగళవారం నోటీసులు పంపించారు.   

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)