Breaking News

మూసీ పేరిట లూటీకే వ్యతిరేకం

Published on Mon, 10/28/2024 - 03:50

మల్లాపూర్‌ (హైదరాబాద్‌): మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, అభివృద్ధికి తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదని, దానిపేరిట లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి ఢిల్లీ పెద్దల కోసం లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. 

ఆరు గ్యారంటీలను పక్కనపెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చుపెడతామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, కేవలం రూ.1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే సుందరీకరణ పూర్తి అవుతుందని చెప్పారు.  నాచారంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ (ఎస్టీపీ) పనితీరును పార్టీ నేతలతో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం
బీఆర్‌ఎస్‌ హయాంలోని పదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మాజీమంత్రి కేటీఆర్‌ చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని తెలిపారు.  పేద ప్రజల ఇళ్లు కూలగొట్టి షాపింగ్‌ మాల్స్‌ కట్టేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని, పేదలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్‌ చెప్పారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆవు పంచకంతో ఎస్టీపీ శుద్ధి
కేటీఆర్‌ నాచారం ఎస్టీపీ సందర్శన సందర్భంగా స్థానిక కాంగ్రెస్‌ నేతలు చేతులకు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్‌ తిరిగిన ప్రదేశంలో ఆవు పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ హెచ్‌ఆర్‌ మోహన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)