Breaking News

కాంగ్రెస్‌ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

Published on Wed, 11/26/2025 - 03:27

సాక్షి, హైదరాబాద్‌: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థులు ఉద్యమ రణభేరి మోగించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. విద్యారంగం అభిృద్ధికి బీఆర్‌ఎస్‌ ఎలాంటి కృషి చేయలేదంటూ కాంగ్రెస్‌ చేస్తున్న అబ ద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. 

వేలా ది మంది విద్యార్థులను సమీకరించి ప్రతీ అసెంబ్లీ ని యోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నందినగర్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. 

సమకాలీన రాజకీయాలపై స్పందించండి 
‘ప్రతీ విద్యార్థి సోషల్‌ మీడియా ఖాతాను కలిగి ఉండి సమకాలీన రాజకీయాలపై గట్టిగా స్పందించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ అమలు చేస్తామని కాంగ్రెస్‌ ఇచి్చన హామీపై యువతను జాగృతం చేయాలి. 

పార్టీ అధినేత చేపట్టిన దీక్షా దివస్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో మహా ఘట్టంగా నిలిచిపోతుంది. విద్యార్థులు, అమరుల త్యాగ ఫలితం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైంది. నవంబర్‌ 29న పార్టీ చేపడుతున్న దీక్షా దివస్‌ను అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించాలి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

రేవంత్‌ అవినీతి కోసమే ‘హిల్ట్‌ పి’
‘పారిశ్రామిక భూముల బదలాయింపు పాలసీ ‘హిల్ట్‌ పి’పేరిట 9,292 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు రేవంత్‌ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపింది. గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలకు ఇచి్చన భూములను ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే యత్నం జరుగుతోంది. హిల్ట్‌ పి ద్వారా అంబానీ సరసన నిలిచేందుకు రేవంత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఈ భూదందాపై ప్రజలను జాగృతం చేసేలా విద్యార్థి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి’అని కేటీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ రూపొందించిన పోస్టర్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)