ఈఆర్సీ తిరస్కరించడం బీఆర్‌ఎస్‌ విజయమే

Published on Wed, 10/30/2024 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించడం బీఆర్‌ఎస్‌ సాధించిన విజయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపగలిగి నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ మంగళవారం ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ఈఆర్సీ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్‌ చార్జీలు పెంచని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భిన్నంగా, కేవలం 10 నెలల్లోనే రూ.18,500 కోట్ల విద్యు త్‌ చార్జీల పెంపు ప్రతి పాదనలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పబ్లిక్‌ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగినట్టు తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు స్వయంగా తనతోపాటు విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి , ఇతర సీనియర్‌ నాయకులు రాష్ట్ర ఈఆర్సీని కలిసి విద్యుత్‌ చార్జీల పెంపును ఆపాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పాల్గొని ప్రజల తరఫున వాదనలు వినిపించారన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యా లను, అవినీతిని ఎత్తి చూపినందుకు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌పైన ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్‌లో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ తమపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటా యని, కాంగ్రెస్‌ పార్టీ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలు, ప్రాపగండా, అబద్ధాలను ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)