Breaking News

రాష్ట్రాన్ని మరో బుల్డోజర్‌ రాజ్‌ కానివ్వొద్దు

Published on Sat, 08/31/2024 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్‌ చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించా లని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయా న్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్ర శ్నించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు. ‘ఒక రి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్ర యులుగా మార్చటం అమానవీయం, అన్యాయం అని గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో పేదల ఇళ్లను అదే రీతిలో కూల్చే స్తూ వారిని నిరాశ్రయులు చేస్తు న్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ‘ అని ప్రశ్నించారు.

పేదల జీవితాలను ఆగం చేస్తోన్న కాంగ్రెస్‌
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చి వేసిన 75 ఇళ్లలో 25 నివాసాలు వికలాంగులకు చెందినవేనని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటమనేది చట్టపరంగా సరైన విధానం కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు.  సుమారు 40 ఏళ్ల క్రితం నుంచే ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం ఎంతటి అమానవీయమో ఖర్గే చెప్పాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆగం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)